చెరువుల ఆక్రమణలపై సర్వే, హద్దులు తేల్చాలి: సీపీఐ

లవేశ్యకాంతల, తామర, బేతుపల్లి చెరువుల్లో ఆక్రమణలపై సర్వే చేసి, హద్దులు తేల్చాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు. సత్తుపల్లిలోని ఐబీ ఈఈ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించి, అధికారులకు వినతిపత్రం అందజేశారు. బేతుపల్లి పెద్ద చెరువు పరిధిలోని కళంగి, కాకర్లపల్లి, రేజర్ల, సత్యనారాయణపురం, గంగారం గ్రామాల్లో చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిపై సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించి, మిగులు భూములను పేదలకు పంచాలని ఆయన కోరారు.
