ఆదివారం ఖమ్మంలో వైకాపా నేత అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి జడ్పీ సెంటర్ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీగా వెళ్లిన నాయకులు, కార్యకర్తలు అంబటి అహంకారానికి నిదర్శనమని, ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.