ఏఐతో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్ చేసినట్లుగా తెలంగాణ టీడీపీ నేతలను గుర్తుతెలియని వ్యక్తి మోసగించాడు. ఈ నెల 7న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు టీడీపీ నేతలకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. దేవినేని ఉమా పేరుతో ఆ వ్యక్తి ఫోన్ చేసి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇప్పిస్తానన్నాడు. మీతో సీఎం చంద్రబాబు మాట్లాడతారని చెప్పాడు. కాసేపటికే వీడియో కాల్‌లో చంద్రబాబును పోలిన వ్యక్తి మాట్లాడారు. ఈ క్రమంలో రూ.10 వేలు ఇవ్వాలని అడగడంతో వారికి అనుమానం వచ్చింది.