తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణపై వస్తున్న ఆరోపణలు వాస్తవ దూరం అని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొదుమూరి జగన్నాథం గుప్తా ఖమ్మంలో శనివారం తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక సంఘ బలోపేతానికి, సభ్యత్వ విస్తరణకు, న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి అమరవాది కృషి చేశారని, ప్రభుత్వ సహకారంతో ఐదు ఎకరాల స్థలం సాధించడంలోనూ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. దొంగ, డూప్లికేట్ సభ్యత్వాలు, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు నిరాధారమని, వ్యక్తిగత విమర్శలతో ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని సూచించారు. కోర్టు ప్రక్రియకు అనుగుణంగా
ఎన్నికలు జరిగి ఫలితాలను గౌరవించాలని ఆయన అన్నారు.