రూ.500 నోట్ల కలకలం

8చూసినవారు
రూ.500 నోట్ల కలకలం
ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని లచ్చాపురం గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న చెరువు కట్ట సమీపంలో రూ.500 నోట్లు చిందరవందరగా పడి ఉండటంతో స్థానికులు కలకలం చెందారు. నిర్మానుష్య ప్రాంతంలో, చెత్తలో డబ్బులు కనిపించడంతో అవాక్కయ్యారు. మొత్తం రూ.30 వేల వరకు నకిలీ నోట్లు ఉండవచ్చని స్థానికులు అంచనా వేశారు. సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ నోట్లు నకిలీవని నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్