ఖమ్మం జిల్లా పాతర్లపాడులో సీపీఎం నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావును దుండగులు హత్య చేశారు. ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఖమ్మంలో శాంతి భద్రతలపై పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశిస్తూ, ఖమ్మంలో హింసా రాజకీయాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.