అబద్ధాల రావు, డ్రామారావు కట్టుకథలు అల్లుతున్నారు: మంత్రి
By sunitha 0చూసినవారురాష్ట్ర ప్రభుత్వం, మంత్రులపై బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు నిజాలను వక్రీకరించి, అబద్ధాల రావు, డ్రామారావు కేటీఆర్ కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల దోపిడీ బయటపడుతుందనే భయంతోనే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, సింగరేణిలో అవినీతి అంటూ భట్టిపై చేసిన విమర్శలను గుర్తుచేశారు.