ఖమ్మం జిల్లాలో ప్రస్తుత వానాకాలం సాగుకు యూరియా కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి. పుల్లయ్య తెలిపారు. జిల్లా అవసరాల నిమిత్తం 35,267 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ఇప్పటివరకు 18,492 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు. రైతులు 9,163 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, ఇంకా 16,527 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.