దొంగలున్నారు తస్మాత్ జాగ్రత్త!

2చూసినవారు
దొంగలున్నారు తస్మాత్ జాగ్రత్త!
కారేపల్లిలో ఇటీవల చోరీలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి బీరువాలను లక్ష్యంగా చేసుకుని బంగారం, వెండి ఆభరణాలను దోచుకుంటున్నారు. ఒక కుటుంబం ఇంటి ముందు నిద్రిస్తుండగా, దుండగులు ఇంటి వెనుక నుంచి వచ్చి బీరువాలోని నగలను ఎత్తుకెళ్లిన సంఘటనతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. రాత్రి 10.30 నుంచి అర్ధరాత్రి వరకు గస్తీ పెంచాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్