కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఐ బోనకల్లు మండల కార్యదర్శి యంగల ఆనందరావు డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. గోవిందాపురం ఎల్ గ్రామంలో జరిగిన మూడు గ్రామాల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళలకు రూ. 2, 500, రైతు భరోసా, యువ వికాసం, చేయూత వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. పెండింగ్ హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో జక్కుల రామారావు, ఆకిన పవన్ తదితరులు పాల్గొన్నారు.