విద్యుత్ తీగల ముప్పు... అధికారులు స్పందించాలి

11చూసినవారు
విద్యుత్ తీగల ముప్పు... అధికారులు స్పందించాలి
ఖమ్మం నగరంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలు, తీగలు, డివీలను తక్షణమే తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. నరసింహస్వామి ఆలయం, కనకదుర్గమ్మ ఆలయం సమీపంలోని ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలని కోరారు. చిన్న గాలికే తీగలు తగిలి నిప్పురవ్వలు రావడం, వాహనాలపై పడే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. పాఠశాలలు, పిల్లలు ఆడుకునే ప్రాంతాల్లో వేలాడుతున్న తీగలు ప్రమాదకరంగా మారాయని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి స్తంభాలకు మరమ్మతులు చేయాలని, వేలాడుతున్న తీగలను సరిచేయాలని కోరారు. కార్యక్రమంలో మహమ్మద్ సలాం, యానాల సాంబశివరెడ్డి, సీహెచ్ దుర్గానాథ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్