రఘునాథపాలెం మండలం కోయచలక, రేగులచలక గ్రామాల్లో శనివారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో ఆరేళ్ల శశీంద్ర అనే చిన్నారి ముఖంపై తీవ్ర గాయమైంది. కుక్క దాడిలో పలు పశువులు, కోళ్లు కూడా గాయపడ్డాయి. గాయపడిన చిన్నారికి ఖమ్మం ఓ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ అనంతరం ప్రైవేటు ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఈ సంఘటనతో గ్రామస్థులు వీధి కుక్కల పట్ల భయాందోళన చెందుతున్నారు. కుక్కల సంఖ్యను అదుపు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.