తిరుమలాయపాలెం మండలం ఏలువారిగూడెం స్టేజీ సమీపాన శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బీరోలుకు చెందిన ఎస్. మోహిన్ (24) తన స్నేహితుడు జాకీర్ తో కలిసి బైక్ పై దమ్మాయిగూడెం వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈక్రమాన ఏలువారిగూడెం మూలమలుపు వద్ద తాటి చెట్లకు తగిలి పడిపోయారు. ఈ ఘటనలో మోహిన్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, జాకీర్ కు తీవ్రగాయాలు అయ్యాయి.