ఖమ్మం నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం టీఎన్టీయూసీ ఏర్పాటు చేసిన దిమ్మెను ఆర్టీసీ సిబ్బంది తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులు ఏర్పాటు చేసుకున్న దిమ్మెను అకారణంగా కూల్చివేయడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.