ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు వెల్లడయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 15,200, కొత్త మిర్చి ధర రూ. 14,500గా నమోదైంది. పత్తి క్వింటా ధర రూ. 7,500గా ఉంది. గత బుధవారంతో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ. 200 పెరిగింది. కొత్త మిర్చి, పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ వివరాలను మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారులు తెలిపారు.