ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు తగ్గాయి. క్వింటా ఏసీ మిర్చి రూ. 19,200, కొత్త మిర్చి రూ. 19,700, పత్తి రూ. 7,800 పలికింది. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ. 600, పత్తి ధర రూ. 100 తగ్గగా, కొత్త మిర్చి ధర స్థిరంగా ఉంది. గత రెండు రోజులు పెరిగిన ఏసీ మిర్చి ధర ఇవాళ భారీగా తగ్గడం గమనార్హం.