ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు వెల్లడయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 19,000, కొత్త మిర్చి ధర రూ. 19,700, పత్తి ధర రూ. 7,800గా నమోదైంది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 200 తగ్గగా, కొత్త మిర్చి, పత్తి ధరలు స్థిరంగా ఉన్నాయని వ్యాపారులు తెలిపారు. మార్కెట్ నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరపాలని సూచించారు.