ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 13, 350, క్వింటా నాన్ ఏసీ మిర్చి రూ. 8, 600, అటు క్వింటా పత్తి ధర రూ. 7, 775 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 50, నాన్ ఏసీ మిర్చి రూ. 600 పెరగగా.. అటు పత్తి ధర రూ. 25 తగ్గిందని వ్యాపారస్తులు పేర్కొన్నారు.