ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 19,200, కొత్త మిర్చి ధర రూ. 19,425గా నమోదయ్యాయి. పత్తి క్వింటా ధర రూ. 7,700 పలికింది. గత శుక్రవారంతో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ. 100 తగ్గగా, కొత్త మిర్చి ధర రూ. 125, పత్తి ధర రూ. 200 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. రైతులు మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు.