ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 13,900, క్వింటా నాన్ ఏసీ మిర్చి ధర రూ. 8,800గా జెండా పాట పలుకగా, క్వింటా పత్తి ధర రూ. 7860 జెండా పాట పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా. నాన్ ఏసీ మిర్చి ధర రూ. 200, పత్తి ధర రూ. 65 తగ్గినట్లు వ్యాపారస్తులు పేర్కొన్నారు.