ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు వెల్లడయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 15,000, కొత్త మిర్చి ధర రూ. 14,500 పలికింది. క్వింటా పత్తి ధర రూ. 7,500 జెండా పాట పాడింది. మార్కెట్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గత సోమవారంతో పోల్చితే పత్తి ధర రూ. 50 తగ్గింది. అయితే, కొత్త మిర్చి, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.