ఖమ్మం పరిసర ప్రాంతాలు, మహబూబాబాద్ నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కేబుల్ వంతెన నిర్మాణ పనుల నేపథ్యంలో ములకలపల్లి క్రాస్ నుంచి నాయుడుపేట వైపు వాహనాల రాకపోకలను నిషేధించారు. ప్రత్యామ్నాయంగా, వాహనదారులు బైపాస్ లేదా బీబీఎం స్కూల్ మీదుగా జలగం నగర్ చేరుకుని ఖమ్మంలోకి వెళ్లాలని సూచించారు. ఈ మార్పులు నిర్మాణ పనుల కారణంగా తాత్కాలికంగా అమలులో ఉంటాయి.