ఖమ్మం జిల్లా బోనకల్లు గ్రామపంచాయతీ సెంటర్ లో విపరీతమైన ట్రాఫిక్, భారీ వాహనాలు టర్న్ తీసుకోవడంలో ఇబ్బందులు నెలకొన్నాయి. నాలుగు రోడ్ల కూడలి కావడంతో ఈ జంక్షన్ లో ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయోనని స్థానికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, సెంటర్ లో రింగ్ లేకపోవడం వంటి కారణాలతో గతంలో ప్రమాదాలు జరిగాయి. వీటిని గమనించి, ప్రమాదాల నివారణకు రింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.