గుర్రప్ప తండాలో విషాదం: విద్యుత్ షాక్‌తో యువ రైతు బలి

0చూసినవారు
గుర్రప్ప తండాలో విషాదం: విద్యుత్ షాక్‌తో యువ రైతు బలి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్ప తండాలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల్లో భాగంగా విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై బానోత్ మహేందర్ అనే యువరైతు మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువరైతు మృతితో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్