ఖమ్మం జిల్లాలోని జిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ బట్టు వెంకన్నను, ఇటీవల జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నుండి రాష్ట్ర స్థాయి ధ్యాన్ చంద్ ఎక్సిలెన్సీ అవార్డు అందుకున్న సందర్భంగా, కళాశాల ప్రిన్సిపాల్ డా. మొహ్మద్ జాకిరుల్లా బుధవారం ఘనంగా సన్మానించారు. విద్యార్థులను క్రీడాంశాల్లో నిష్ణాతులను చేస్తున్నందుకు ఈ పురస్కారం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శాస్త్రి, డా. శ్రీనివాస్, డా. రామసత్యవతి, డా. ఏ. సునంద పాల్గొన్నారు.