ఖమ్మంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్ బాబు అకాల మరణం పట్ల ఖమ్మం లోకల్ ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్, మమత హాస్పిటల్ ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్లు సంతాపం వ్యక్తం చేశాయి. మూడు యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ జగదీష్ బాబు పార్థివ దేహం ముందు ఆదివారం అంబులెన్స్ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ సభ్యులు అంబులెన్స్‌లతో ర్యాలీలో పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. వైద్యరంగంలో డాక్టర్ జగదీష్ బాబు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి ఖమ్మం ప్రజలకు, వైద్యరంగానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.