ఖమ్మం జిల్లాలోని త్రివేణి పాఠశాల 6వ తరగతి ఐఐటీ ప్రైమ్ సెక్షన్ విద్యార్థిని కాసోజు పునర్వి, టీ.ఏ–2 పరీక్షలో ప్రథమ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ పునర్విని అభినందిస్తూ, క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారిస్తే ఉన్నత
ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పునర్వి విజయం ఆమె పట్టుదల, కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ స్వప్న, ముస్తఫా, సీఆర్వో కాట్రగడ్డ మురళీకృష్ణ, క్యాంపస్ ఇంచార్జ్ విక్టర్ చార్లెస్, ఇంచార్జ్ అశోక్, అనూష, ఉపాధ్యాయులు,
విద్యార్థులు పాల్గొన్నారు.