నాంపల్లిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ లో గురువారం సిపిఆర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్, విప్రో ఫౌండేషన్, తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలోని త్రివేణి పాఠశాల విద్యార్థులు 'బయోడైవర్సిటీ' అంశంపై చేసిన కృషికి గుర్తింపు లభించింది. వీరి ప్రాజెక్టు ప్రాంతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి విద్యార్థుల విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.