ఖమ్మం కలెక్టర్ గా టీఎస్ దివాకర

3చూసినవారు
ఖమ్మం కలెక్టర్ గా టీఎస్ దివాకర
ములుగు కలెక్టర్ టీఎస్ దివాకరను ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా నియమించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన దివాకర గతంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు, ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలించి, పరిష్కరించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్‌గా ఉన్న అనుదీప్‌ను ఐటీఈ అండ్ సీ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు. దీంతో పాటు, అనుదీప్ తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు.

ట్యాగ్స్ :