మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

1చూసినవారు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
జగిత్యాలలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రిని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ తరఫున మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు కాసం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కోశాధికారి కొండా సంజీవ కుమార్ తదితర ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్