ఖమ్మం మమతా రోడ్‌లోని శ్రీ చైతన్య ఒలంపియాడ్ స్కూల్‌లో అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ విషయంపై జిల్లా డీఈఓ, అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారులకు సమాచారం అందడంతో, మండల విద్యాధికారి శైలజ వెంటనే స్పందించి పాఠశాల గోడౌన్లను తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం, పాఠశాలకు సంబంధించిన రెండు గోడౌన్లను అధికారులు సీజ్ చేశారు.