ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అటవీ డివిజన్ పరిధిలోని కనకగిరి (పులిగుండాల) అడవుల్లో రెండు చిరుత పులులు స్వేచ్ఛగా సంచరిస్తూ ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. ఒక జంతువు కళేబరం చుట్టూ ఈ చిరుతలు తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత నెలలో కూడా ఒక చిరుత తన పిల్లలతో ఆడుకుంటున్న వీడియోను అధికారులు విడుదల చేశారు. వరుసగా చిరుతల ఉనికి కనిపిస్తుండటంతో ఈ ప్రాంతం వన్యప్రాణుల మనుగడకు అత్యంత అనుకూలంగా మారిందని స్పష్టమవుతోంది.