ఖమ్మం కమిషనరేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (సీసీఆర్బీ) ఏసీపీగా అడపా నరసింహారావు, సీటీసీ (కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్) ఏసీపీగా బి. హరనాథ్ బాబును నియమిస్తూ డీజీపీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల డీఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వగా ఖమ్మంకు వీరిద్దరినీ కేటాయించారు. గతంలో ఇక్కడ డీఎస్పీలుగా పనిచేసి పదోన్నతి పొందిన సి. రాజిరెడ్డికి సీఐడీ డీఎస్పీగా, టి. స్వామికి కరీంనగర్ సీసీఆర్బీ ఏసీపీగా పోస్టింగ్ లభించింది.