జాతీయ రహదారులపై పెరుగుతున్న ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో వెల్లడించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రమాదాల విశ్లేషణ, బాధితులకు బీమా క్లెయిమ్లను వేగవంతం చేసేందుకు 'ఈ-డీఏఆర్' అనే డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.