సార్వత్రిక పది, ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల

1చూసినవారు
సార్వత్రిక పది, ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల
గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన సార్వత్రిక పది, ఇంటర్ పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు ఇన్చార్జి డీఈఓ శ్రీనివాస రావు, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంగపతిరావు ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగతిలో మొత్తం 1,406 మందిలో 703(50 శాతం), ఇంటర్మీడియట్లో మొత్తం 1,579 మందిలో 1,040 మంది (65.86 శాతం) ఉత్తీ ర్థులయ్యారు. పరీక్ష ఫలితాలను అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్లో చూసుకోవాలన్నారు. రీకౌంట్, రీవెరిఫికేషన్ అవసర మైన వారు జూన్ 2 నుంచి 7వరకు మీసేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్