రాచమళ్ల ఉపేందర్ రచనల ఆవిష్కరణ

959చూసినవారు
రాచమళ్ల ఉపేందర్ రచనల ఆవిష్కరణ
ఖమ్మంలో ప్రముఖ సాహితీ సంస్థ “అక్షరాల తోవ” ఆధ్వర్యంలో ప్రముఖ కథా రచయిత రాచమళ్ల ఉపేందర్ రచించిన “ఉడికిన మెతుకు” కథల సంపుటి, “అక్షరానుభూతి” సమీక్షల సంకలనం పుస్తకాలను ఈ నెల 27న ఆవిష్కరించనున్నట్లు సంస్థ నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్ తెలిపారు. ఖమ్మం జడ్పీ మీటింగ్ హాల్‌లో సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రముఖ సాహితీవేత్తలు హాజరుకానున్న ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్