మంగళవారం రాత్రి తిరుమలాయపాలెం మండలం బీరోలులో కుందూరు ఉదయ్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు హత్యాప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఉదయ్ తీవ్రంగా గాయపడగా, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం తప్పడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. హోలీ పండుగ రోజున జరిగిన ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.