ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థులనే గెలిపించాలని ఆ పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రజలను కోరారు. మంగళవారం కారేపల్లిలో జరిగిన మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, స్థానికంగా ఏ సమస్య వచ్చినా సీపీఐ(ఎం) నాయకత్వం ముందుండి పరిష్కారం కోసం కృషి చేస్తుందని, పోడు భూములు, స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. సీపీఐ(ఎం)తోనే పేదలకు ప్రభుత్వ పథకాలు, పారదర్శకత సాధ్యమని గతంలో నిరూపితమైన సందర్భాలను గుర్తు చేశారు.