సత్తుపల్లిలో వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మోహన్ రంగా తనయుడు వంగవీటి రాధా పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పగడాల మంజుల, ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమం వంగవీటి అభిమానులకు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైనదిగా మారింది.