KMM జిల్లా RTA కార్యాలయం సమీపంలో ఏజెంట్ షాపుల ద్వారా నకిలీ ఆధార్ కార్డులతో వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయ సిబ్బంది సహకారంతో దళారులు ఫోర్జరీ పత్రాలు సృష్టించి, ఫైనాన్స్ కట్టని వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, దీని ద్వారా భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారని సమాచారం. కీలకమైన ఆధార్ కార్డునే నకిలీగా మారుస్తున్న ఈ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.