ఖమ్మం భూదాన్ బాధితుల్లో 311 మందికి పట్టాలు ఇచ్చి, మిగిలిన 600 మందికి పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వెలుగుమట్ల నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ కేవీ. కృష్ణారావు తెలిపారు. బుధవారం రిపబ్లిక్ పార్టీ ఆఫ్
ఇండియా జాతీయ అధ్యక్షులు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈనెల 16న వెలుగుమట్ల ప్రాంతాన్ని పరిశీలించి, సమస్యను రాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్తానని అంబేద్కర్ హామీ ఇచ్చారు.