బోదులబండలో గ్రానైట్ క్వారీ హియరింగ్‌పై గ్రామస్తుల ఆగ్రహం

2చూసినవారు
బోదులబండలో గ్రానైట్ క్వారీ హియరింగ్‌పై గ్రామస్తుల ఆగ్రహం
నేలకొండపల్లి మండలం బోదులబండలో గ్రానైట్ క్వారీ ఏర్పాటుకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దండోరా వేయకుండా, గ్రామపంచాయతీకి సమాచారం ఇవ్వకుండా హియరింగ్ నిర్వహించారని ఆరోపించారు. క్వారీలతో తాగునీటి సమస్య, దుమ్ము, బ్లాస్టింగ్ వల్ల ఇళ్లకు పగుళ్లు, పంటలకు నష్టం కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వాహనాలతో రహదారులు ధ్వంసమవుతున్నాయని తెలిపారు. నిబంధనల ప్రకారం మళ్లీ పారదర్శకంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, ప్రస్తుత హియరింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్