ఖమ్మంలో వినాయక లడ్డు వేలం:..రూ. 85,116 కు అమ్మకం

10చూసినవారు
ఖమ్మంలో వినాయక లడ్డు వేలం:..రూ. 85,116 కు అమ్మకం
ఖమ్మం జిల్లా, ప్రశాంత్ నగర్ 6 వ డివిజన్లోని శ్రీ విఘ్నేశ్వర షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం జరిగిన వినాయక ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదానం తర్వాత లడ్డు, అమ్మవారి చీర, స్వామి వారి వస్త్రాలు, డబ్బుల దండల వేలంపాట నిర్వహించారు. రికార్డు స్థాయిలో మల్లెంపాటి రామారావు వాణి గారు రూ. 85,116 కు లడ్డూను దక్కించుకున్నారు. అమ్మవారి చీర మరియు డబ్బుల దండలు రూ. 35,348 కు నూర్ డోర్స్ షేక్ మహబూబ్ బాషా, అమ్మవారి చీర రూ. 15,232 కు గంటల స్వరూప దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్