రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పాల్గొని, ఇప్పటివరకు జరిగిన ఫారాల పంపిణీ పురోగతిని సమీక్షించారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరికి ఫారాలు అందజేయాలని ఆయన సూచించారు.