భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. ఎస్సై రవి

2చూసినవారు
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. ఎస్సై రవి
ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు రాబోయే రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని బోనకల్ ఎస్సై మాచినేని రవి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లవద్దని, చెరువులు, కాలువలు, ఇతర నీటి ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని, ముఖ్యంగా పిల్లలను ఆ ప్రాంతాల్లో ఆడుకోవడానికి అనుమతించవద్దని ఆయన కోరారు. వర్షాల కారణంగా రోడ్లపై చెట్లు పడటం, రహదారులకు అడ్డంకులు ఏర్పడటం లేదా నీటి గుంతలు ఏర్పడటం వంటి ఇబ్బందులు ఉంటే పోలీసులకు తెలియజేయాలని, కరెంటు స్తంభాల వద్దకు వెళ్లవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్