గిరిజనుల సమస్యలపై ఉద్యమించాలి

1చూసినవారు
గిరిజనుల సమస్యలపై ఉద్యమించాలి
గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర రామ్మూర్తి నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్‌లో నిర్వహించిన జిల్లా రెండో కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్‌ప్లాన్ నిధులు, రైతులకు సబ్సిడీలు అందించాలని కోరారు. ప్రతి మండలంలో కమిటీలు ఏర్పాటు చేసి సమాఖ్యను బలోపేతం చేయాలన్నారు. భద్రాచలంలో జరగనున్న జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మహమ్మద్ మౌలానా, దండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్