ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారులు, డ్రైన్లు నిర్మిస్తాం

1చూసినవారు
ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారులు, డ్రైన్లు నిర్మిస్తాం
ఖమ్మం 6, 7వ డివిజన్లలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం రూ. 1.50కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం నగరం విస్తరిస్తోందని, రహదారులు, డ్రైనేజీ ప్రధాన సమస్యలని గుర్తించి అమృత్ పథకం కింద రూ. 200 కోట్లు, యూజీడీ కింద రూ. 250 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. కొత్తగా విలీనమైన పంచాయతీల్లో రహదారులు, డ్రైన్లు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని, రహదారుల విస్తరణ, డ్రైనేజీ పనులు పక్కాగా దీర్ఘకాలం ఉపయోగపడేలా చేస్తామని హామీ ఇచ్చారు.