తెలంగాణ ప్రభుత్వం ఖజానా నింపేందుకు వ్యవసాయ భూములపై 'భూమి శిస్తు' పేరుతో కొత్త పన్ను విధించే యోచనలో ఉన్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ మేరకు భూమి శిస్తు విధివిధానాల ఖరారుపై త్వరలోనే ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, భూకబ్జాలను తగ్గించి, అసలైన యజమానులకు భూ హక్కులు కల్పించడానికే ఈ శిస్తు తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు.