మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మంగళవారం ఖమ్మంలో ది గాడ్ థెరిస్సా మహిళా మండలి, కే. సీ. పుల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నారీ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. మరికొందరికి కుట్టు మిషన్లు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గుర్రం ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.