ఖమ్మంలోని కస్బాబజార్‌లో అర్ధరాత్రి ఆర్ఎంపీ వైద్యుడు బీఎన్ రావు భార్య ప్రమీల హత్యకు గురైంది. పిల్లలు పుట్టరనే కారణంతో భార్యాభర్తలు విడిపోయారు. భర్త స్నేహితుడు శ్రావణ్ వేధింపులపై నెలక్రితం భద్రాచలంలో ప్రమీల కేసు పెట్టింది. ప్రస్తుతం ఖమ్మంలో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఆమెను శ్రావణే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.